పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి
● సమస్యాత్మక, అతి సమస్యాత్మక
పోలింగ్ కేంద్రాలను గుర్తించండి
● పోలీస్ అధికారులతో సీపీ సాయిచైతన్య
బోధన్‌రూరల్: పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సీపీ సాయిచైతన్య ఆదేశించారు. ఓటర్లు శాంతియుత వాతవరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి విడత గ్రామపంచాయతీల ఎన్నికలు బోధన్ డివిజన్ పరిధిలో జరగనున్న నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ సమీ క్ష నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం, గుర్తులను ప్రదర్శించడాన్ని నివారించాలన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్, టౌన్ సీఐలు విజయ్‌బాబు, వెంకట్‌నారాయణ, నిజామాబాద్ నార్త్ సీఐ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.


