వణికిస్తున్న చలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో 8 గంటల వరకు ప్రజలు రోడ్లపై కనిపించడం లేదు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తేదీ ఉష్ణోగ్రత
9 12.1
8 12.6
7 14.8
6 15.2
5 17.5
4 17.4


