
వర్సిటీలో అకడమిక్ వాతావరణం నెలకొల్పాలి
● బయోమెట్రిక్ హాజరు అమలు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో అకడమిక్ వాతావరణం నెలకొల్పడానికి అన్ని విభాగాల అధిపతులు కృషి చేయాలని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు సూచించారు. తన చాంబర్‌లో బుధవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరితో కలిసి అని విభాగాల అధిపతులతో వీసీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు వర్సిటీలో బయోమెట్రిక్ హాజరువిధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కళాశాలల్లో అడ్మిషన్స్ పొందిన విద్యార్థులకు పకడ్బందీగా తరగతులు నిర్వహించాలన్నారు. ఎట్టి పరిస్థితులలో పరీక్షలు వాయిదా వేయొద్దని, సమయానికి ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో వర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్, బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్ సాయిలు, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్, ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, జెట్లింగ్ ఎల్లోసా, సమత, ప్రసన్న, సత్యనారాయణ రెడ్డి, నీలిమా, లక్షణ చక్రవర్తి, పాత నాగరాజు, పీఆర్‌వో పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.