
బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ధ్రువపత్రం తీసుకోవాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: ఆస్పత్రులన్నీ బయో మెడికల్ వ్వర్థాల నిర్వహణ ధ్రువపత్రం తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతోపాటు ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ఎక్స్‌రే, క్లినిక్‌లు బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ధ్రువపత్రం తీసుకోవాలన్నారు. ధ్రువపత్రం లేకుండా కొనసాగితే చర్యలు తీసుకుంటామన్నారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్‌లో ఉన్న బయో మెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కి తరలించాలని సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావీ, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మణ్ ప్రసాద్, మెడికేర్ బయో మెడికల్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.