
విద్యార్థులు సమాజసేవలో ముందుండాలి
తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు చదువుతో పాటు సమాజసేవా కార్యక్రమాల్లో ముందుండాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్–ఛాన్స్‌లర్ టి యాదగిరావు అన్నారు. బుధవారం తెయూ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం, ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఏబీవీపీ కేవలం విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు చేయడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్షించిన వారిమవుతామన్నారు. ప్రధాన వక్తగా హాజరైన ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి యే లక్ష్యంగా ఏబీవీపీ జాతీయవాద స్ఫూర్తితో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆంజనేయులు, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ చారి, యూనివర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్, ఉపాధ్యక్షుడు అనిల్, నాయకులు నవీన్, సమీర్, పృథ్వీ, అక్షయ్, మనోజ్, అజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.
వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు