
దత్తత తీసుకోబడిన గ్రామమే దత్తాపూర్
డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామాన్ని దేశ్‌ముఖ్ అనే దొర దత్తత తీసుకొని పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ గ్రామానికి దత్తాపూర్ అనే పేరు వచ్చినట్లు ఊరి పెద్దలు చెప్తున్నారు. సుమారు 200 ఏళ్ల క్రితం లంబాడీ తండా మాత్రమే ఉండేదని, కాలక్రమేనా గ్రామంగా అవతరించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
● తొండాకూర్ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న దత్తాపూర్ 1981లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం 900 ఎకరాల వరకు సాగు భూములు, 395 నివాస గృహాలున్నాయి.
● మొదట్లో తండా ఉండటంతో ఊరిలో లంబాడీ(గిరిజన) కుటుంబాలు 100కు పైగా ఉన్నాయి. అందుకే ఈ ఊరికి మొదటి సర్పంచ్‌గా మూడ్ రామ్‌జీ 1981లో ఎన్నికయ్యారు. 1959లో గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటైంది.
● గ్రామానికి రెండు చెరువులున్నాయి. ఒకటి పెద్ద చెరువు, మరొకటి గ్రామకుంట. పెద్ద చెరువు విస్తీర్ణం 106ఎకరాలు ఉంటుంది. ఉమ్మడి నందిపేట్ మండలంలో కుద్వాన్‌పూర్ చెరువు తర్వాత దత్తాపూర్ పెద్ద చెరువుదే అతి పెద్ద విస్తీర్ణం.
● దత్తాపూర్‌లో దత్తాత్రేయుడికి ఊరంతా భక్తులే. వందేళ్ల క్రితమే శివదత్త గుడిని కట్టారు. అప్పటి నుంచే పూజలు, భజనలు చేస్తున్నారు. ఏటా దత్త జయంతి రోజున (పౌర్ణమి) పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి నిష్టతో దత్తుడిని పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల్లో నమ్మకం ఏర్పడింది.
– డొంకేశ్వర్(ఆర్మూర్)
మీకు తెలుసా?