
కెమిస్ట్రీ విభాగంలో క్యాంపస్ సెలెక్షన్స్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర(కెమిస్ట్రీ) విభాగం ఆధ్వర్యంలో హెటిరో డ్రగ్స్, హైదరాబాద్ కంపెనీ ప్రతినిధులు బుధవారం వర్సిటీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. తెయూ మెయిన్ క్యాంపస్‌తో పాటు భిక్కనూర్ సౌత్ క్యాంపస్, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలతో పాటు వివిధ అనుబంధ కళాశాలల నుంచి 102 మంది ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థులు ఈ సెలెక్షన్స్‌లో పాల్గొన్నట్లు విభాగాధిపతి సాయిలు తెలిపారు. ఇందులో రాతపరీక్షలో 54 మంది విద్యార్థులు ఎంపికకావడం సంతోషకరమైన విషయమన్నారు. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థుల జాబితాను రెండు రోజుల్లో మెయిల్ ద్వారా వర్సిటీకి పంపిస్తామని హెటిరో డ్రగ్స్ కంపెనీ ప్రతినిధులు తెలిపినట్లు సాయిలు పేర్కొన్నారు. రాతపరీక్షలో ఎంపికై న విద్యార్థులను వీసీ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి అభినందించారు. కార్యక్రమంలో హెటిరో డ్రగ్స్ కంపెనీ డిప్యూటీ చీఫ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, హెచ్‌ఆర్ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు, కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు నాగరాజు, బాలకిషన్, నాగరావు, సురేశ్, నాగేశ్వరరావు, రాజేశ్వరి, డానియల్, నాగేంద్రబాబు, సునీత, రఘువీర్, గంగాధర్, విద్యార్థులు పాల్గొన్నారు.