
రీయింబర్స్‌మెంట్ అందించాలి..
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, టీజీవీపీ నాయకులు వేర్వేరుగా డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సమస్యను ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించారు. టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ.. రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కళాశాలలో యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. అలాగే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలన్నారు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు విగ్నేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.