
ఫర్టిలైజర్ దుకాణం తనిఖీ
కమ్మర్‌పల్లి: కలుపు మందు పిచికారితో సోయాబీన్ పంట ఎండిపోవడంతో మందు విక్రయించిన ఫర్టిలైజర్ దుకాణాన్ని డీఏవో వీరస్వామి సోమవారం తనిఖీ చేశారు. గడ్డి మందు కొట్టడంతో సోయాబీన్ పంటలు ఎండిపోయాయని రైతులు వ్యవసాయాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో మండలంలోని ఉప్లూర్, కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి గ్రామల్లో కలుపు మందు పిచికారి చేయడంతో ఎండిపోయిన పంటలను వారు పరిశీలించారు. అనంతరం రైతులు కొనుగోలు చేసిన ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. పంటకు నష్టం చేకూర్చిన కలుపు మందు(హెర్బిసైడ్స్)ను ఎవరికి విక్రయించుకుండా సీజ్ చేశారు. శాంపిల్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టు రాగానే చట్టపరమైన ఆదేశాలు తీసుకుంటామని డీఏవో తెలిపారు. ఏవో రమ్యశ్రీ, ఏఈవోలు తదితరులు ఉన్నారు.
‘అర్చకుల సమస్యల
పరిష్కారానికి కృషి’
సదాశివనగర్: అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడు తున్నామని అర్చకులు కమిషనర్‌తో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల అర్చ క సంఘ అధ్యక్షులు అంజనప్ప, రాచప్ప, గ్రేట ర్ హైదరాబాద్ అధ్యక్షుడు గోపి కృష్ణమాచార్యులు, ఆయా ఆలయాల కమిటీల చైర్మన్‌లు బీరయ్య, రవి, రాజయ్య, స్థానిక అర్చకులు సంతోష్‌కుమార్ శర్మ, జంగం గంగాధర్, ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల అందజేత
ఖలీల్‌వాడి: నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెల్‌ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి ఫోన్లను అందించినట్లు ఎస్సై సాయిరెడ్డి సోమవారం తెలిపారు. 11 మందికి సెల్‌ఫోన్‌లు అందించామని, సెల్‌ఫోన్ పోతే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈసందర్భంగా ఫోన్లను రికవరీ చేసిన కానిస్టేబుళ్లు సుప్రియ, సలావుద్దీన్‌లను ఎస్సై అభినందించారు.

ఫర్టిలైజర్ దుకాణం తనిఖీ