
నత్తనడకన బదిలీలు.. నిరాశలో సెర్ప్ సిబ్బంది
డొంకేశ్వర్(ఆర్మూర్): సెర్ప్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. బదిలీల జీవో వచ్చి రెండు నెలలు దాటినా ప్రక్రియను పూర్తిచేయకుండా రాష్ట్ర శాఖ అధికారులు సాగదీస్తున్నారు. కేవలం ఏపీడీ, డీపీఎంల బదిలీలను నిర్వహించిన ఉన్నతాధికారులు ఏపీఎంలు, సీసీలు, ఇతర ఉద్యోగుల విషయంలో నాన్చుతున్నారు. దీంతో పక్షం రోజుల్లో పూర్తయ్యే బదిలీలకు నెలలు గడుస్తున్నాయని సిబ్బంది వాపోతున్నారు.
జిల్లాలో సుమారు 200 మంది..
గ్రామీణాభివృద్ధి శాఖలో ఐకేపీ ఉద్యోగులకు గత ప దేళ్లుగా బదిలీలు లేవు. రాష్ట్ర ఉన్నతాధికారులపై ఒ త్తిడి పెట్టి ఇటీవల ఏపీడీ, డీపీఎంలు బదిలీలు పూర్తి చేసుకున్నారు. మండల స్థాయిలో పని చేసే ఏపీఎంలు, సీసీలు స్థానచలనం కోసం ఆప్షన్లు పెట్టుకుని బది లీల కోసం వేచి చూస్తున్నారు. జిల్లాలో బదిలీల కో సం వేచి చూస్తున్న ఏపీఎంలు 30మంది, సీసీలు 165 వరకు ఉండగా ఇతర సిబ్బంది 10మంది ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి సెర్ప్‌లో అన్ని కేడర్ ఉద్యోగుల బదిలీలు పూర్తి కావాల్సి ఉండగా, ఉన్నతాధికారులు సాగదీయడం పట్ల ఏపీఎంలు, సీసీలు అసంతృప్తిగా ఉన్నారు. బదిలీలు ఆలస్యమైతే స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. అదే జరిగితే రాకరాక వచ్చిన అవకాశం ఎక్కడ చేజారిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాకు చేరని సీనియారిటీ లిస్టు..
ఏపీఎంలు, సీసీల బదిలీలకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ముందుకు కదల్లేదు. జిల్లాలో పని చేస్తున్న వారందరి సీనియారిటీ లిస్టును రాష్ట్ర అధికారులు తెప్పించుకున్నారు. దానిని పరిశీలించి జిల్లాకు పంపాల్సి ఉంది. కానీ, సీనియారిటీ జాబితా ఇంత వరకు జిల్లాకు రాలేదు. జోనల్ స్థాయి ప్రకారమా? లేదా జిల్లా స్థాయా? ఎలా నిర్ణయించి జాబితాను పంపుతారానేది స్పష్టత లేదు. జిల్లా కలెక్టర్‌కు లిస్టు అందిన తర్వాత ఏపీఎంలు, సీసీలకు బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇదంతా జరిగే సరికి మరో పదిహేను రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ రాకముందే తమ బదిలీలు కూడా పూర్తి చేయాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
జీవో వచ్చి రెండు నెలలు దాటినా పూర్తికాని ప్రక్రియ
ఎక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుందోనని భయం