ఆస్పత్రిలో రోగి భర్త ఆత్మహత్య
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కామారెడ్డి జి ల్లా జుక్కల్ మండలం మహమ్మద్ నగర్‌కు చెందిన సాయిలు (38) గురువారం అర్ధ రా త్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు భార్య సంగీతను అనారోగ్యం కారణంగా ఈ నెల 6న ఆస్పత్రిలో చేర్పించారు. సంగీత రక్త హీనత లో బాధపడుతోంది. భార్యకు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన సాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కక్షిదారు వద్దకు న్యాయమూర్తి
ఆర్మూర్‌టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఆర్మూర్ కోర్టులో శుక్రవారం కొ ట్లాట కేసులో ఇరువురు రాజీపడ్డారు. అయి తే నడవలేని స్థితిలో ఉన్న కక్షిదారు దగ్గరకే న్యాయమూర్తి సరళ రాణి వచ్చారు. ఈ కేసులో రాజీ కుదిర్చారని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
నేడు జాతీయ
లోక్ అదాలత్
● జిల్లా వ్యాప్తంగా 18 బెంచ్‌ల ఏర్పాటు
నిజామాబాద్ లీగల్ : కేసుల సత్వర పరిష్కారంలో భాగంగా జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాతీ య లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మొత్తం 18 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ కోర్టులో 11, బోధన్‌లో 4, ఆర్మూర్‌లో 3 బెంచ్‌లు కేసుల పరిష్కారం కోసం కృషిచేస్తాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయభాస్కర్ రావు తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, మునిసిపల్, మోటారు బీ మా, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్ కేసు లు పరిష్కరించనున్నట్టు తెలిపారు. కక్షిదారులు కేసుల సత్వర పరిష్కారం కోసం రాజీమార్గమే రాజమార్గం అన్న ధోరణితో లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 2026 సివిల్ సర్వీస్ పరీక్షకు సన్నద్ధమయ్యే వారికి ఉచితంగా లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నా రు. ఈనెల 16 నుంచి జూలై 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. ఉచిత కోచింగ్ హైదరాబాద్‌లోని లక్ష్మీనగర్‌లో ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న వారిలో వందమంది ప్రతిభావంతులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 08462 241055 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
రేపు ప్రణవానంద దాస్ స్వామీజీ రాక
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో ఆది వారం జరిగే పలు కార్యాక్రమాలలో పాల్గొనేందుకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రతినిధి ప్రణవానంద దాస్ రానున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భూమేశ్ గుప్తా తెలిపారు. శుక్రవారం కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. స్వామీజీ రాక సందర్భంగా ఆదివారం సాయంత్రం పట్టణంలోని హౌసింగ్ బోర్డు శారదామాత ఆలయం నుంచి ధర్మశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో స్వామివారి ప్రవచన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తు లు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఇస్కాన్ కామారెడ్డి ఇన్‌చార్జి వెంకటరాస్, కన్వీనర్ సిద్దిరాములు, ప్రతినిధులు శ్రీహరి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో రోగి భర్త ఆత్మహత్య
ఆస్పత్రిలో రోగి భర్త ఆత్మహత్య


