అమ్మకు అక్షరాభ్యాసం
పొతంగల్ ఖుర్దులో నిరక్షరాస్య మహిళలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తోటి సంఘం సభ్యులు
కామారెడ్డి టౌన్ : వంద శాతం మహిళలను అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యంతో కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ ‘అమ్మకు అక్షరాభ్యాసం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందు లో భాగంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలో నిరక్షరాస్యులై న మహిళలను అక్షరా స్యులుగా చేయనున్నారు.
జిల్లాలోని 25 మండలాల్లో 17,194 స్వ యం సహాయక సంఘాలున్నాయి. వాటిలో 42,749 మంది సభ్యులు నిరక్షరాస్యులని గు ర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొ ట్టమొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శు క్రవారం గాంధారి మండలం పొతంగల్ ఖు ర్దులో డీఈవో రాజు ప్రారంభించారు. వేదపండితుడితో అక్షరాభ్యాసం పూజ చే యించి పలకా బలపం పట్టించి అక్షరాలు దిద్దించారు.
తోటి సభ్యులతో చదువుచెప్పించే ప్రణాళిక..
న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్‌కు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్యలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు అదే గ్రూపులోని అక్షరాస్యులైన మహిళలతో చదువు చెప్పించనున్నారు. వయోజన విద్యా విభాగం ప్రత్యేక కార్యక్రమాలతో వారు అక్షరాలు చదివేలా, చిన్నపాటి లెక్కలు చేసేలా, ఇంగ్లిష్ చదివేలా చేయాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి బడిబాటలో భాగంగా నిర్వహిస్తున్న సామూహిక అక్షరాభ్యాసాలతో పాటు వయోజన విద్య విభాగానికి సంబంధించిన ’అమ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని అధికారులు పెర్కొన్నారు.
వందశాతం అక్షరాస్యత జిల్లాగా మార్చేందుకు కృషి
వంద శాతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చేందుకు ‘అ మ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమం ప్రారంభించాం. జిల్లావ్యాప్తంగా స్వయం సహాయ క సంఘాలలో వయసుతో సంబంధం లే కుండా నిరక్షరాస్యులైన వారిని గుర్తించాం. వారందరికీ ఈ కార్యక్రమంలో చదు వు నే ర్పుతాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి


