బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కలెక్టర్‌గా టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయం వద్దకు చేరుకున్న ఆయనకు అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు. నేరు గా తన చాంబర్‌కు చేరుకున్న కృష్ణారెడ్డి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు, స్థా నిక పరిస్థితుల గురించి చర్చించారు. కొత్త కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులు కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లతో పాటు ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యో గ సంఘాల నాయకులు కలెక్టర్‌కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
వినయ్ కృష్ణారెడ్డికి స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు
బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్
బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్


