బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం

Jun 13 2025 4:43 AM | Updated on Jun 13 2025 4:43 AM

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం

నిజామాబాద్‌ లీగల్‌ : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి, బాల బాలికలకు మంచి భవిష్యత్తును అందిద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌ రావు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ–మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చంద్రశేఖర్‌ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల బాలికలను కార్మికులుగా మార్చకుండా వారికి మంచి విద్యను అందించి, ఉజ్వల భవిష్యత్తును కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి రసూల్‌ బి మాట్లాడుతూ బాలల హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడాలని అన్నారు. కార్మిక శాఖ అధికారి యోహాను మాట్లాడుతూ బాలబాలికలతో పనిచేయిస్తే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయించారు. డీసీపీవో చైతన్య, సీడీపీవో స్వర్ణలత, సూపర్వైజర్లు ప్రియదర్శిని, శ్రీ ప్రియ, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్‌ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement