కూలిన చెట్లు.. విరిగిన స్తంభాలు
సుభాష్‌నగర్/నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన ఈదురు గాలుల వర్షం బీభత్సం సృష్టించింది. సగటు వర్షపాతం 15.8 నమోదైంది. భారీ వృక్షాలు, 123 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా కలెక్టరేట్ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. నష్టం తీవ్రంగా ఉండడంతో విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. నందిపేట్, మాక్లూర్, నవీపేట్ మండలాల్లో వడగండ్ల వాన కురిసింది.
అక్కడక్కడా చెట్ల కొమ్మలు, వృక్షాలు తీగలపై పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం కాగా, ఎన్‌పీడీసీఎల్‌కు రూ.18.30 లక్షల నష్టం కలిగింది. గాలులకు ద్విచక్రవాహనాలు కింద పడిపోగా, ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకూలాయి. వర్షంతో కూడిన బలమైన ఈదురు గాలులకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఏర్గట్ల, మోపాల్, పొతంగల్ మండలాల్లో మూడు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. జిల్లా కేంద్రంలో చెట్ల కొమ్మలు విరిగి పడి 17 స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సిబ్బంది కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి ఐదారు గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఎస్‌ఈ నుంచి సబ్‌స్టేషన్ ఆపరేటర్ వరకు రాత్రంతా విధుల్లోనే ఉన్నారు. మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వేగంగా విద్యుత్ పునరుద్ధరణపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.
గాలివాన బీభత్సం
నేలకొరిగిన 123 విద్యుత్ స్తంభాలు
మూడు వ్యవసాయ
ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం
ఎన్‌పీడీసీఎల్‌కు రూ.18.30 లక్షల నష్టం
పాక్షికంగా దెబ్బతిన్న 20 ఇళ్లు
జిల్లాలో 15.8 మిల్లీమీటర్ల
సగటు వర్షపాతం నమోదు
చెట్టు కూలి లైన్ ఇన్‌స్పెక్టర్ మృతి
ఖలీల్‌వాడి/బాన్సువాడ : ఈదురు గాలి వర్షం వల్ల ఇద్దరు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ నగరం వినాయక్‌నగర్‌లో సోమవారం రాత్రి తీవ్రమైన వర్షానికి సంజీవరెడ్డి కాలనీకి చెందిన
విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్ ఆస్వాడ్ శ్రీనివాస్ (55) తల దాచుకోడానికి పక్కనున్న కల్లు బట్టిలోకి వెళ్లాడు. అదే సమయంలో చెట్టుకూలి కల్లుబట్టి రేకులపై బడింది. రేకులు విరిగి శ్రీనివాస్ పై పడ్డాయి. దీంతో తీవ్రగాయాలైన అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తాడ్కోల్ శివారులో గల డబుల్ బెడ్ రూం కాలనీకి చెందిన ప్రభు (55) రాత్రి తన ఇంటి డాబాపై పడుకున్నాడు. ఒక్కసా రిగా ఈదురు గాలులు రావడంతో నిద్రలోంచి లేచి కిందికి దిగుతుండగా కాలుజారి కింద పడ్డా డు. తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.
దాబాపై నుంచి పడి మరొకరు..
కూలిన చెట్లు.. విరిగిన స్తంభాలు


