
ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని కలెక్టరేట్‌లో గురువారం దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్ పూలమాల వేసి నివాళులులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహనీయులను గౌరవించుకోవడంతోపాటు వారి స్ఫూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిణి నిర్మల, వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో..
ఖలీల్‌వాడి: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం భాగ్యరెడ్డి వర్మ జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు డీసీపీ బస్వారెడ్డి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భాగ్యరెడ్డి వర్మ ఆశయాల సాధనకు కృషి చేయాలని, వారికి అన్ని రకాల సహకారాలు అందించుటకు పోలీస్ శాఖ నిరంతరం చిత్తశుద్ధితో ఉంటుందని అన్నారు.

ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి