
ధాన్యం లారీ బోల్తా: డ్రైవర్‌కు గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్‌పేటలోగల కోదండ రామాలయం వద్ద గురువారం సాయంత్రం ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ జాఫర్‌కు గాయాలయ్యాయి. లారీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మెయిన్‌రోడ్డుపైకి వచ్చే క్రమంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం గోపాల్‌పేటలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. లారీలోని ధా న్యం బస్తాలు తడిచిపోకుండా లాపర్లను కప్పారు.
సాంబార్‌లో పడి బాలుడికి..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు మథుర సాత్విక్ ప్రమాదవశాత్తు సాంబార్‌లో పడి తీవ్రంగా గాయపడిన ట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గాంధారి మండ లం గౌరారం తండాలో గురువారం జరిగిన వివా హ వేడుకకు సాత్విక్ తల్లిదండ్రులు రాజ్‌కుమార్, లలితలతో కలిసి వెళ్లాడు. సాయంత్రం సాత్విక్ ఆడుకుంటూ సాంబార్‌లో పడిపోయాడు. వెంటనే స్థానికులు గుర్తించి బాలుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.
స్తంభం పైనుంచి పడి యువకుడికి..
మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లిలో విద్యుత్ మరమ్మతులు చేపడుతుండగా ఓ యువకుడు స్తంభం పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. నర్సింగ్‌పల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు మతిన్ అనే కాంట్రాక్టర్‌కు అధికారులు పనులు అప్పగించారు. కాంట్రాక్టర్ వద్ద పని చేసేందుకు కందకుర్తి నుంచి ముషీర్ అనే యువకుడు వచ్చాడు. పనులు చేస్తున్న క్రమంలో ముషీర్ స్తంభం పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయమై ఏఈ నాగశర్వాణిని ‘సాక్షి’ వివరణ కోరగా, ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

ధాన్యం లారీ బోల్తా: డ్రైవర్‌కు గాయాలు