
నిరసన గళమెత్తిన జర్నలిస్టులు
నిజామాబాద్‌అర్బన్: ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, సెర్చ్ వారెంట్ లేకుండా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడం సరైంది కాదని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట సుమారు రెండు గంటలపాటు నిరసన తెలిపాయి. ‘జర్నలిస్టుల ఐక్యత వర్ధ్ధిల్లాలి.. ఎడిటర్ ధనంజయరెడ్డికి న్యాయం జరగాలి..’ అంటూ నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను మానుకోవాలన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్రనాయకుడు జమాల్‌పూర్ గణేశ్ మా ట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను, హక్కులను ప్ర భుత్వాలు హరించడం సరికాదన్నారు.మీడియా పై దౌర్జన్యాలు కొనసాగితే ఊరుకునే ప్రసక్తే లేద ని స్పష్టం చేశారు. ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బిలి నర్స య్య మాట్లాడుతూ.. సా క్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇలాగే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై దౌర్జన్యం కొనసాగిస్తోందని, అధికార బలంతో అణగదొక్కా లని చూస్తోందని విమర్శించారు. ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఐజే యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రమోద్‌గౌడ్, నాయకుడు రవికుమార్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మండే మోహన్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు ఆశనారాయ ణ తదితరులు ప్రసంగించారు. అనంతరం కలె క్టరేట్ ప్రవేశ మార్గం నుంచి నిరసన ప్రదర్శనగా వెళ్లి అదనపు కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ధనుంజయ్, ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అంగల రామ్‌చందర్, సదానంద్, పంచరెడ్డి శ్రీ కాంత్, దేవల్ రవిబాబు, ఇంగుశ్రీనివాస్, ఉమామహేశ్వర్, కొక్క రవి, ఆంజనేయులు, జాన్సన్, సురేశ్, సాక్షి బ్యూరో ఇన్‌చార్జి భద్రారెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జి ప్రభాకర్, సాక్షి టీవీ వీడియో జర్నలిస్ట్ సాయికిరణ్, నిజామాబాద్ ఆర్‌సీ ఇన్‌చార్జి సంజీవ్, రూరల్ ఆర్‌సీ ఇన్‌చార్జి మురళి తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ ఎడిటర్‌పై
అక్రమ కేసులు ఎత్తివేయాలి
కలెక్టరేట్ ఎదుట
నల్లబ్యాడ్జీలతో నిరసన

నిరసన గళమెత్తిన జర్నలిస్టులు