
గడ్కోల్‌లో భూపతిరెడ్డికి బోనాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు
సిరికొండ/ధర్పల్లి: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమి లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు మంచి రోజులు వస్తా యని రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి అన్నారు. సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్, గడ్కోల్, కొండాపూర్, తూంపల్లి, ధర్పల్లి మండలంలోని మద్దుల్ తండా, వాడి, హొన్నాజీపేట్, గుడితండా తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు బోనాలు, మంగళ హారతు లతో భూపతిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సిరికొండ మండలానికి చెందిన వాడని రెండు సార్లు గెలిపిస్తే మండలాన్ని గాలికి వదిలేశాడని విమర్శించారు. రెండోసారి గెలవగానే రెండు సంవత్సరాల్లోపు సాగు నీరు తేకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి నీళ్లు తేలేదని, రాజీనామా చేయలేదని ఆరోపించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి తనను దీవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాయకులు నగేష్‌రెడ్డి, గడీల రాము లు, బాల నర్సయ్య, భాస్కర్‌రెడ్డి, రవి, బద్దం రా మచందర్, ఎర్రన్న, ఆర్మూర్ బాలరాజ్, నర్సయ్య, భగవాన్‌రెడ్డి, సుభాష్, సంతోష్‌నాయక్, నరేష్, భూపతి, సంతోష్‌రెడ్డి, కిరణ్, సాగర్‌రెడ్డి ఉన్నారు.
ధర్పల్లి/ఇందల్వాయి: ధర్పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి పార్టీ కండువాలు కప్పి, కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అలాగే ఇందల్వాయి మండలం వెంగల్‌పాడ్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.

ధర్పల్లిలో పలువురు నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న భూపతిరెడ్డి