
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని మారుతి వరుణ్ నెక్సా షోరూంలో సోమవారం 70మంది ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కంపెనీ ఆధ్వర్యంలో డీఈవో దుర్గాప్రసాద్, షోరూం మేనేజర్ మధు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ సన్మానం చేశారు. డీఈవో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరవలేనిదని తెలిపారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా అంబర్‌సింగ్
నిజామాబాద్‌అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ విధులు నిర్వర్తిస్తున్న డా.ఎన్.అంబర్‌సింగ్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం వరించింది. ఆయన స్వగ్రామం మోపాల్ మండలం ముదక్‌పల్లి గ్రామం. 2011లో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం అయ్యారు. అంబర్‌సింగ్‌కు అవార్డు రావడంతో కళాశాల వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
సొంత ఖర్చుతో ఆన్‌లైన్‌లో విద్యాబోధన
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధనను అందించడానికి నవీపేట మండలం అబ్బపూర్‌తండా ప్రభుత్వ ప్రా థమిక పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ అబ్దుల్ కృషి చేస్తున్నాడు. ఇందుకు ఎడిటింగ్ కోర్సు ఆన్‌లైన్‌లో నేర్చుకొని, పిల్లల కోసం యూట్యూబ్‌లో వీడియో లు అప్‌లోడ్ చేస్తున్నాడు. పిల్లలు కనీస స్థాయి నుంచి అవగాహన చేసుకునేలా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, గణితం ఆంగ్లం పాఠాల ను యూట్యూబ్‌లో 180కు పైగా వీడియోలు అప్లోడ్ చేశాడు. కరోనా విజృంభించిన సమయంలో విద్యార్థులు పాఠాలు నష్టపోకుండా యూట్యూబ్లో వీడియోలు చేసి వాటిని విద్యార్థులకు అందించారు.


అంబర్‌సింగ్