
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో డోండి ప్రసన్నకుమారి, మాస్ కమ్యూనికేషన్ విభాగంలో గుగులో త్ శంకర్ నాయక్, పసునూరి శ్రీధర్‌బాబు శుక్రవారం పీహెచ్‌డీ సాధించారు. బయోటెక్నాలజీ విభాగం అధ్యాపకురాలు కాసుల కిరణ్మయి ప ర్యవేక్షణలో ప్రసన్నకుమారి ‘ఇన్ విట్రో జనరేషన్ జెనెటిక్ ట్రాన్స్‌ఫర్‌మిషన్ స్టడీస్ (గస్ కై టానెస్ జీ న్స్) అండ్ రెస్పాన్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ డిఫె న్స్ సిస్టం ఎట్ హై టెంపరేచర్ ఇన్ కర్‌కుమ్మ లోంగా’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్దాంతగ్రంథం సమర్పించారు. మాస్ కమ్యూనికేషన్ అధ్యాపకుడు వై ప్రభంజన్‌యాదవ్ పర్యవేక్షణలో ‘ద యూస్ ఆఫ్ మీడియా ఇన్ స్వచ్ఛభారత్ మిషన్’ అనే అంశంపై గుగులోత్ శంకర్‌నాయక్ పరిశోధన గ్రంథం సమర్పించారు. మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ఘంటా చంద్రశేఖర్ పర్యవేక్షణలో పసునూరి శ్రీధర్‌బాబు ‘తెలంగాణ ఉద్యమంలో టెలివిజన్ వార్తల ప్రభావం’ అనే అంశంపై పరిశోధన చేశారు. శుక్రవారం వీరికి వైవా నిర్వహించి పీహెచ్‌డీ అంజేశారు. కార్యక్రమాల్లో వీసీ రవీందర్‌గుప్తా, బయోటెక్నాలజీ హెచ్‌వోడీ జవేరియా ఉజ్మ, బీవోఎస్ చైర్మన్ పర్సన్స్ మామిడాల ప్రవీణ్, శాంతాబాయి, సైన్స్ డీన్ సీహెచ్ ఆరతి, కంట్రోలర్ ఎం అరుణ, ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ పాల్గొన్నారు.

