
జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లిలో గురువారం రాత్రి ‘బలగం’ సినిమా చిత్రాన్ని ప్రదర్శించారు. సర్పంచ్ సాయరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసి బలగం సినిమాను ప్రదర్శించారు. గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సినిమా ప్రదర్శనను ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆసక్తిగా తిలకించారు.
‘ఆయుష్మాన్ భారత్’తో
పేదలకు మేలు
సుభాష్‌నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్జేస్తున్న ఆయూష్మాన్‌భారత్ పథకంతో పేదలకు అధిక ప్రయోజనం చేకూరుతోందని హిందూ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ధాత్రిక రమేష్ పేర్కొన్నారు. నగరంలోని అర్హులైన పేదలను గుర్తించి గురువారం ధాత్రిక రమేష్, ఐటీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెల్ల రేషన్‌కార్డుతో ఆన్‌లైన్‌లో ఈ–కేవైసీ చేశారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ పథకం ద్వారా ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.5లక్షల వరకు వైద్యచికిత్సలు పొందవచ్చని తెలిపారు.
పరీక్షలంటే భయపడొద్దు
డిచ్‌పల్లి: విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని విడిచిపెట్టాలని, ఒక ప్రణాళిక ప్రకారం ఇష్టప డి చదివితే మంచి మార్కులు సాధించవచ్చని నిజామాబాద్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సంపూర్ణ సూచించారు. మండల కేంద్రంలోని మానవతసదన్‌ను గురువారం సాయంత్రం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్ష లు బాగా రాయాలని, ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని సూచించారు. ఇంటర్ పూర్తయిన పిల్లలు ఎంబీబీఎస్ కోసం సిద్ధం కావాలని తెలిపారు. పిల్లలు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. కమిటీ మెంబర్ శోభ, సదన్ కేర్‌టేకర్ అందెరమేష్, కొల్లరవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాడీ ఫ్రీజర్ అందజేత
ఖలీల్‌వాడి: నగరంలోని వినాయక్ నగర్‌కు చెందిన కరికేల్లి ప్రేమ్‌సాయి తన తండ్రి కరికేల్లి రా జేందర్ గుప్తా జ్ఞాపకార్థం మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్‌కు గురువారం డెడ్ బాడీ ఫ్రీజర్‌ను అందజేశారు. మంచాల ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ తదితరులు పాల్గొన్నారు.
రసవత్తరంగా కుస్తీ పోటీలు
రెంజల్(బోధన్): కందకుర్తిలో నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా జరిగాయి. శ్రీరామనవమి పండగను పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం గ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. రెంజల్‌లో పాటు చుట్టుపక్కల మండలాలు, మహారాష్ట్ర నుంచి కుస్తీలు పట్టేందుకు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరి కుస్తీ విజేతకు రూ.15 తులాల వెండి కడియాన్ని స్థానిక సర్పంచ్ ఖలీంబేగ్, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్‌రాజ్‌లు అందించారు.
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలో కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు.
రుద్రూర్: మోస్రా మండలం గోవూర్‌లో గ్రామాభివృద్ధి కమిటీ, గౌడ సంఘం ఆధ్వర్యంలో గురువారం కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. తొలి కుస్తీ రూ.50తో ప్రారంభం కాగా ఆఖరు కుస్తీ రూ.2,500తో ముగిసింది. స్థానిక సర్పంచ్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎడపల్లి(బోధన్): పోచారంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు. సర్పంచ్ ఇంద్రకరణ్ పాల్గొన్నారు.



