నిర్మల్‌చైన్‌గేట్: అత్యవసర చికిత్సలు అందించేందు కు నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన భవ నం సిద్ధమైంది. గతంలో ఎప్పుడూ అందని వైద్య సేవలు అతిత్వరలో అందుబాటులోకి రానున్నా యి. గతేడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణాన్ని ప్రారంచారు. మొదట పనులు నత్తనడకన సాగాయి. కొన్ని నెలలుగా వేగం పుంజుకున్నాయి. మరో 15 రోజుల్లో భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అత్యాధునిక హంగులు..
జీ ప్లస్–2తో అత్యాధునిక హంగులతో భవనం నిర్మిస్తున్నారు. భవనం కోసం రూ.10 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.13.75 కోట్లు వెచ్చిస్తున్నారు. 50 పడకల సామర్థ్యంతో భవనం నిర్మిస్తున్నారు. ప్రతీబెడ్ వద్ద ఆధునిక మానిటరింగ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లు, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్, సర్జికల్ సపోర్ట్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తారు.
ఎమర్జెన్సీ ట్రీట్మెంట్..
ఆధునిక పరికరాలతో కూడిన క్రిటికల్ కేర్ సెంటర్‌ను వేగంగా ఆధునికీకరిస్తున్నారు. దీనిద్వారా రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, ఊపిరితిత్తులు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుతుంది. క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభమైతే ఆస్పత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. పేషెంట్ల ప్రాణరక్షణలో ఇది అత్యంత కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఇప్పటికే కొత్త సదుపాయం కోసం సన్నద్ధమవుతున్నారు.
తుదిదశకు పనులు..
ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయ్యింది. విద్యుత్. ఆక్సిజన్ కనెక్షన్లు, అంతర్గత ఫర్నిషింగ్ పనులుశరవేగంగా జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో అన్నిఏర్పాట్లు పూర్తి చేసి సెంటర్‌ను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
15 రోజుల్లో పనులు పూర్తి..
క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించారు. మౌలిక సదుపాయాలతోపాటు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. పనులను తరచూ పర్యవేక్షిస్తున్నాం. 15 రోజులలో సేవలు అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– శ్రీకాంత్, ఏఈ, టీజీఎంఎస్‌ఐడీసీ


