నిర్మల్‌చైన్‌గేట్: మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం యాప్, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, పౌర సేవల గుర్తింపు పత్రాలజారీ తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. యాప్ వివరాలపై తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. రెవెన్యూ అధికారులంతా ఈ యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే ఇసుక అమ్మక కూపన్‌లు ఇవ్వాలన్నారు. ఈ విధానంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. అన్నిరకాల పౌర సేవల గుర్తింపు పత్రాల జారీలో ఆలస్యం చేయవద్దని సూచించారు. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి, ఓటర్ ప్రోజెని మ్యాపింగ్ త్వరగా పూర్తిచేయాలన్నారు. మండలాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మైనింగ్ ఏడీ హరి ప్రసాద్, భూగర్భ జలాల శాఖ సంచాలకులు శ్రీనివాసబాబు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


