భూగర్భ జలాలు కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలు కాపాడుకోవాలి

Mar 25 2026 6:58 AM | Updated on Mar 25 2026 6:58 AM

మామడ: భూగర్భ జలాలను కాపాడుకోవాలని భూగర్భశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌బాబు అన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్బంగా మండలంలోని బండలఖానాపూర్‌లో భూగర్భ జలశాఖ, అవల్‌రూరల్‌ లైవ్‌లీహుడ్‌ ఎంపవర్‌మెంట్‌ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. భూగర్భ జలాలు పెంపొందించడంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసి పట్టాలని తెలిపారు. భూగర్భ జలాల వినియోగం, నిర్వహణ, సంరక్షణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ఎంపీవో హరికృష్ణ, సర్పంచ్‌ కళ్యాణిసచిన్‌కుమార్‌, ఈజీఎస్‌ ఏపీవో శివాజీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ క్రాంతి, మత్స్యపరిశ్రమశాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement