న్యూస్‌రీల్
నిర్మల్
బాక్సింగ్ ఎంపిక పోటీలు
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలోని సహస్ర బా క్సింగ్ అకాడమీలో అండర్–19 బాల, బాలి కల ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించా రు. బాలుర విభాగంలో అభిలాష్ (50 కిలోల విభాగం), బాలికలలో ఆర్.అనన్య (48 కిలోల విభాగం), అక్షయ (51 కిలోలు), పి.అభినయ (57 కిలోలు), వనజ(60 కిలోల) ఎంపికయ్యారు. ఈనెల 21 నుంచి 22 వరకు మహబూబ్ నగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా బాక్సింగ్ సెక్రెటరీ చందుల స్వామి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: రోజురోజుకూ విస్తరిస్తున్న జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ ఇక్కట్లు వర్ణనాతీతం. ఇరుకురోడ్లకు తోడు సగం రహదారి వరకూ వచ్చేస్తున్న ఆక్రమణలు వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారుతున్నాయి. పట్టణ శివారులోకి తరలిపోతున్న ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు దూరభారమవుతున్నాయి. అసలే ట్రాఫిక్‌తో సతమవుతున్న జిల్లాకేంద్రం నుంచే భారీవాహనాలూ వెళ్తుండటంతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తోంది. వీటికి ఉపశమనం కలిగించేది ‘రింగురోడ్డు’. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఈ రహదారి ఎంత ఉపయుక్తంగా మారిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జిల్లాకేంద్రాల చుట్టూ నిర్మించాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి రోడ్లు, భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో నిర్మల్‌లోనూ ఎంతోకొంత ట్రాఫిక్ ఇబ్బందులు, ఆఫీసుల దూరభారాలు తగ్గుతాయన్న భావన ఉంది.
ట్రాఫిక్ నిత్యనరకం..
జిల్లా కేంద్రంలో కొండాపూర్ నుంచి మంజులాపూర్ వరకు, కడ్తాల్ నుంచి విశ్వనాథ్‌పేట్ వరకు వందలాది వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా శివాజీచౌక్, ఈద్‌గాం చౌరస్తా, ఆర్డీవో కార్యాలయం, జయశంకర్‌చౌక్, వివేక్ చౌక్, బస్టాండ్, అంబేడ్కర్‌చౌక్‌లలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. కొన్నిచోట్ల సిగ్నల్స్ ఉన్నా ఏ వాహనం ఎటువస్తుందో, ఎటు వెళ్తుందో.. అర్థం కాని పరిస్థితి. బస్టాండ్ ప్రాంతంలో ఉదయం, సాయంత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పండుగల సమయాల్లో మరింత నరకంగా మారుతోంది. ఒక్కోసారి గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోతోంది.
సగం రోడ్లపై ఆక్రమణలు..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకేంద్రంలో రోడ్లపై ఆక్రమణలు ఉన్నాయి. ప్రధాన రహదారులు సైతం సగం వరకు ఏదోరకమైన ఆక్రమణలు ఉండటం గమనార్హం. దుకాణదారులే తమ పరిధి దాటి వస్తువులు పెడుతున్నారు. అది కాకుండా వాటి ముందు మరో తోపుడుబండి ఉంటోంది. వీటి వద్ద కొనుగోలు చేయడానికి వచ్చే వాళ్లు రోడ్డుపైనే వాహనాలను నిలుపుతున్నారు. ఇలా.. సగానికిపైగా రహదారి ఆక్రమిస్తున్నారు. ఇలాంటి వాటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. బస్టాండ్, అంబేడ్కర్‌చౌక్, వివేక్‌చౌక్(చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద) కనీసం యూటర్న్ తీసుకోవడం కూడా కష్టమవుతోంది.
పొదుపుతో భరోసా..
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఇంధన వనరులపై పడింది. పరిమిత వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తుంది.
IIలోu
రాష్ట్రం మీదుగా వెళ్తున్న ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 61 ఈరెండు జాతీయ రహదారులకు నిర్మల్ జిల్లాకేంద్రం జంక్షన్‌గా ఉంది. నిత్యం వందల సంఖ్యలో భారీవాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఇందులో ఎన్‌హెచ్ 44కు బైపాస్ ఉండటం భారీ ఊరటనే చెప్పవచ్చు. కానీ మహారాష్ట్రలోని కల్యాణి నుంచి జగిత్యాల వరకు ఉన్న 61రహదారికి మాత్రం బైపాస్ లేదు. దీంతో భారీవాహనాలన్నీ జిల్లాకేంద్రంలో నుంచే వెళ్తున్నాయి. వీటివల్ల రోడ్డుప్రమాదాలతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రింగురోడ్డుతో పరిష్కారం
జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతోపాటు ఎల్లపెల్లి సమీపంలో నిర్మించిన కలెక్టరేట్, రానాపూర్ వద్ద నిర్మిస్తున్న జిల్లా కోర్టులు.. ఇలా పట్టణానికి దూరంగా వెళ్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ఏ మూల నుంచైనా సులువుగా చేరుకోవడానికీ రింగురోడ్డు అవసరం. గతంలోనూ నిర్మల్ చుట్టూ వలయమార్గం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. కానీ.. అప్పటికి, ఇప్పటికీ మార్పులు చోటుచేసుకున్నందున తాజా పరిస్థితులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ సూచనల మేరకు మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.


