ప్రణాళికతో సివిల్స్‌ సులువే.. | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో సివిల్స్‌ సులువే..

Mar 17 2026 7:29 AM | Updated on Mar 17 2026 7:29 AM

నిర్మల్‌ఖిల్లా: పకడ్బందీ ప్రణాళికతో కృషిచేస్తే సివిల్స్‌ సాధన కష్టమేమీకాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిపాలనాశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహణ–యూపీఎస్సీ పాత్ర’ అంశంపై సోమవారం విస్తత ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. సివిల్స్‌ ఆశావాహులకు మార్గదర్శనం చేశారు. అధ్యాపకురాలు వీణ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 315 ఆర్టికల్‌ ప్రకారం యూపీఎస్సీ స్వతంత్ర, చట్టబద్ధ సంస్థగా ఏర్పాటయిందని, ఏటా మూడు దశల్లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన అధికారులను ఎంపిక చేయడంలో సివి ల్‌ సర్వీసెస్‌–యూపీఎస్సీ పాత్ర అత్యున్నతమైనదని తెలిపారు. భారతదేశ పరిపాలనలో సివిల్స్‌పాత్ర గణనీయమైనదన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.సుధాకర్‌, అధ్యాపకులు గంగాధర్‌, రమేశ్‌రెడ్డి, సుభాష్‌, శ్రీహరి, సుల్తానా, రవీందర్‌, రంజిత్‌, మురహరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement