వైట్ కార్డు ఉన్నా.. నో ఛాన్స్!
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కొత్త రేషన్‌కార్డులు జారీ అవుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోంది. ఏళ్లనాటి నిరీక్షణ నెరవేరినా.. వాటిద్వారా పెద్దగా లబ్ధి పొందకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. తెల్ల రేషన్ కార్డు వస్తే పథకాలు అందుతాయి అని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్ కార్డు ఉన్నా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.
నో ‘గ్యారంటీ’..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అఽ దికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉ చిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వ రకు వైద్యం, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా ప థకం కింద ఎకరాకు రూ.6 వేల పెట్టుబడి సహా యం, కూలీలకు ఆర్థికసాయం వంటి పథకాలు ప్రారంభించారు. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 సబ్సిడీ వంటగ్యాస్, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహాల మంజూరు కొనసాగుతోంది. అయితే, కొత్త రేషన్ కార్డుదారులకు ఈ పథకాల లబ్ధి చేరడం లేదు.
కొనసాగుతున్న కార్డుల జారీ..
జిల్లాలో 412 రేషన్ దుకాణాల పరిధిలో 2,33,471 కార్డులు, 7,33,913 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఏడాది 29,386 కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా, అర్హులైన వారికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులను గుర్తిస్తున్నారు.
పథకాలకు ఆన్‌లైన్ అడ్డంకులు
2023, డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ప్రభుత్వం గ్రామ, పట్టణస్థాయిలో దరఖాస్తులను స్వీకరించింది. అప్పటి నుంచి ప్రజాపాలన వెబ్‌సైట్‌లోపాత దరఖాస్తుల సవరణలు మాత్రమే స్వీకరిస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆన్‌లైన్ ఆప్షన్ అందుబాటులో లేకపోవడంతో కొత్త కార్డుదారులు సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారు. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లినా ఆన్‌లైన్ ఆప్షన్ లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.


