డేంజర్.. అండర్ పాస్
నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంగా ఉన్న నేషనల్ హైవే–44 బైపాస్ రహదారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద ఈ రహదారిపై కొత్తగా నిర్మించిన అండర్‌పాస్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రమాదాల నివారణ కోసం నిర్మించిన అండర్‌పాస్.. ప్రమాదాలకే కేంద్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిర్మల్‌వైపు వచ్చే వాహనాలు కడ్తాల్ గ్రామ సర్వీస్ రోడ్డుగుండా వెళ్తున్నాయి. నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు కూడా అదే మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. వాహనాలు ఎదురెదురుగా రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో నేషనల్ హైవే అధికారులు రహదారి మధ్యలో సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు. అయితే అవి కూడా వాహనాలు ఢీకొని కిందపడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
జాతీయ రహదారిపై ఇరుకుగా
రాకపోకలు సాగిస్తున్న వాహనాలు
ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మెలు.. ఇలా ప్రమాదకరంగా..
డేంజర్.. అండర్ పాస్
డేంజర్.. అండర్ పాస్


