చెకుముకి పోటీలకు వేళాయె..
లక్ష్మణచాంద: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన, తార్కికశక్తి పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏటా ‘చెకుముకి ప్రతిభా పరీక్షలు‘ నిర్వహిస్తున్నారు. సమాజంలోని మూఢనమ్మకాలపై అవగాహన కల్పించి, శాసీ్త్రయ విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు అంకం గంగాధర్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్ తెలిపారు.
పరీక్ష విధానం
8 నుంచి 10వ తరగతుల సిలబస్ ఆధారంగా జీవశాస్త్రం, గణితం, సామాజిక శాస్త్రం, సమకా లీన శాస్త్ర–సాంకేతిక అంశాలపై ప్రశ్నలు ఉంటా యి. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు సిద్ధం చేసిన ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 7(శుక్రవారం)నుంచి పాఠశా లస్థాయి ప్రతిభా పరీక్ష జరుగుతుంది. ప్రతీపాఠశాల నుంచి 8, 9, 10వ తరగతుల విద్యార్థులలో ఒక్కొక్కరిని ఎంపికచేస్తారు. అనంతరం ఈ నెల 21న మండల స్థాయి పరీక్షలు నిర్వహించి, ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలల నుంచి ప్రతిభ కనబరచిన విద్యార్థులతో నాలుగు జట్లను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తారు. 28న జిల్లాస్థాయి పరీక్ష జరుగుతుంది.
డిసెంబర్‌లో రాష్ట్రస్థాయి పోటీలు..
పాఠశాల, మండల, జిల్లాస్థాయి పరీక్షలు పూర్తయిన తర్వాత డిసెంబర్ 12 నుంచి 14 వరకు కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి చెకుముకి పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి పరీక్ష రాత పరీక్షగా ఉండగా, రాష్ట్ర స్థాయిలో క్విజ్, డిబేట్, శాసీ్త్రయ పరిశీలనల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా సైన్స్ ప్రయోగ ప్రదర్శనలు, గ్రంథాల పరిచయాలు, సైన్స్ కార్నివాల్ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల శాసీ్త్రయ ఆసక్తిని అభివృద్ధి చేస్తారు.
మండల కేంద్రంలో చెకుముకి పోటీలో పాల్గొన్న విద్యార్థులు(ఫైల్)
శాసీ్త్రయ విజ్ఞానం పెంచేందుకు..
మూడ నమ్మకాలపై అవగాహన కల్పించి విద్యార్థులలో శాసీ్త్రయ ఆలోచనలు పెంచడానికి ప్రతిభా పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా ఈ నెల 7 పాఠశాల స్థాయిలో, 21 మండలస్థాయిలో, 28న జిల్లా స్థాయిలో నిర్వహిస్తాం.
– గంగాధర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు
విద్యార్థులు పాల్గొనాలి
ఈ నెల 7 నుంచి 28 వరకు పాఠశాల, మండల, జిల్లాస్థాయి చెకుముకి పోటీలను నిర్వహించేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఎక్కువ మంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలి.
– భోజన్న, డీఈవో, నిర్మల్
చెకుముకి పోటీలకు వేళాయె..
చెకుముకి పోటీలకు వేళాయె..


