పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
నిర్మల్‌టౌన్: పోలీసు కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో నిర్మల్‌కు చెందిన దాత సౌజన్యంతో ప్రతిభ కలిగి, ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్న హోంగార్డ్ కుటుంబాలకు చెందిన 20 మంది విద్యార్థులకు, గతంలో చనిపోయిన హోంగార్డు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా పేద కుటుంబాలకు చెందిన సిబ్బంది ఉన్నారన్నారు. వారిలో చాలామంది పిల్లలు ప్రతిభావంతులు ఉన్నారని, అలాంటి పిల్లల ప్రతిభను గుర్తించి, ఉన్నత విద్యలో మరింత రాణించేందుకు ఈ ప్రోత్సాహాన్ని అందించామని తెలిపారు.
ప్రోత్సాహం పొందినవారు..
పి.శ్రీనివాస్, శృతిలయ, శివకుమార్, మాసం సాత్విక్, ఆర్.లావణ్య, జాదవ్‌దివ్య, ఎన్.శిల్ప, జె.స్మిత, చరణ్, వర్ష, సాయి సృజన్, దినేష్, గంగమణి, డి.రాకేశ్, ఎండీ.అయాన్‌ఖాన్, ప్రణీత్‌కుమార్, జి.అశ్విని, కె.ఆనంద్, ఐశ్వర్య.


