అనుబంధానికి ప్రతీక | - | Sakshi
Sakshi News home page

అనుబంధానికి ప్రతీక

Oct 24 2025 2:28 AM | Updated on Oct 24 2025 2:28 AM

అనుబం

అనుబంధానికి ప్రతీక

శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 8లోu

న్యూస్‌రీల్‌

పూడికతో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం

లక్షల క్యూసెక్కులు గోదావరి పాలు

అక్కాతమ్ముడు, అన్నాచెలె ్లళ్ల అనుబంధానికి ప్రతిక భావుబీజ్‌ ఉత్సవాలు. మహారాష్ట్రకు అనుకుని ఉన్న మండలాల్లో ఎక్కువగా జరుపుకుంటారు.

నిర్మల్‌

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

మామడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని అడిషనల్‌ కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌ సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మంజూరైన నిఽ దులు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ రాజేశ్వర్‌, డీఈ గంగాధర్‌, మండల ప్రత్యేక అధికారి రాజనర్సయ్య, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ఎంపీవో ఉపేందర్‌, ఏఈ హరీశ్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కడెం:ఈ ఏడాది జిల్లాలో కురిసిన భారీ వర్షాలతోపాటు ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కానీ జలాశయాల్లో పూడిక పెరగడంతో నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి చేరి వృథాగా పోయింది. జిల్లాలోని మూడు ప్రధాన ప్రాజెక్టులు కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ఉండగా.. ఈ వర్షాకాలం మూడు ప్రాజెక్టులకు కలిపి 78.073 టీఎంసీల వరద నీరు వచ్చింది. నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టుల అధికారులు 66.28 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.

కడెంకు సామర్థ్యానికి మించి ఇన్‌ఫ్లో

నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల సరిహద్దులో ఉన్న కడెం ప్రాజెక్టు కింద 68 వేల ఎకరాలకు ఆయకట్టు ఉంది. అయితే ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది 57.388 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, 47.179 టీఎంసీలు గోదావరిపాలయ్యాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, 2.904 టీఎంసీల మేర పూడిక ఉంది. దీంతో ఈ సారి కేవలం 4.699 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అధికారులు ప్రాజెక్టులో పూడిక తొలగించడంతోపాటు గేట్లు, కాలువలకు సాంకేతికంగా మరమ్మతులు అవసరమని పేర్కొంటున్నారు.

‘గడ్డెన్నవాగు’కు ప్రవాహం ఎక్కువ..

భైంసా మండలంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 13,950 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సంవత్సరం ప్రాజెక్టుకు 14.225 టీఎంసీల వరద వచ్చింది. అందులో 12.971 టీఎంసీలను అధికారులు వరద గేట్ల ద్వారా వృథాగా వదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 1.83 టీఎంసీలు మాత్రమే. ప్రస్తుతం 1.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

‘స్వర్ణ’ సామర్థ్యమూ తక్కువే..

సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు కింద సుమారు 9 వేల ఎకరాలు సాగవుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టులోకి 6.130 టీఎంసీల వరదనీరు వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం తక్కువగా ఉండడంతో 6 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.037 టీఎంసీలు. ప్రస్తుతం అదే స్థాయిలో నీరు ఉంది. ప్రాజెక్టు నిండినా వారాలకే నీరు తగ్గిపోతుందని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు.

పూడికతో తగ్గిన సామర్థ్యం..

జిల్లాలోని మూడు ప్రాజెక్టుల్లో ఏళ్లుగా పూడిక తొలగింపు పనులు చేపట్టకపోవడంతో నీటినిల్వ సామర్థ్యం 30–35 శాతం మేర తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో వచ్చిన నీటిని నిల్వ చేసుకోలేకపోవడంతో ఏటా లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది.

కడెం ప్రాజెక్టు వరద గేట్ల నుంచి

దిగువకు వెళ్తున్న నీళ్లు(ఫైల్‌)

పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది

ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంది. ఖరీఫ్‌సాగు పూర్తయింది. రెండో పంటకు సాగు నీరందించేందుకు లీకేజీలను ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాసంగికి కూడా పూర్తిగా నీరు అందిస్తాం. – ప్రవీణ్‌, ఈఈ కడెం ప్రాజెక్టు

ఇదీ జిల్లా ప్రాజెక్టుల

వరద నీటి లెక్క టీఎంసీలలో..

అనుబంధానికి ప్రతీక 
1
1/2

అనుబంధానికి ప్రతీక

అనుబంధానికి ప్రతీక 
2
2/2

అనుబంధానికి ప్రతీక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement