అట్టహాసంగా జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
ఖానాపూర్: పట్టణంలోని ఏసీఈ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు గురువారం నిర్వహించారు. ఎంపీడీవో రమాకాంత్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రవీందర్‌గౌడ్ పోటీలను ప్రారంభించారు. యూత్ విభాగం, జూనియర్ విభాగం, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కుత్బుద్దీన్, కరస్పాండెంట్ షేక్ అజార్, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షోయబ్, ఇమ్రాన్, ఆర్చరీ కోచ్ అంబేడ్కర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్ కిశోర్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపిక
జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన 11 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న వారిలో అభిషేక్, సిద్ధార్థ, రిషిత్, విష్ణు, నవీన్, అయాన్, శ్రీనిధి, సంహిత, వర్షిణి, విజ్ఞత ఉన్నారు. నవంబర్ 7న వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.


