
ప్రకృతి విపత్తులపై అవగాహన
ఖానాపూర్: వర్షాకాలం దృష్ట్యా గోదావరి, వాగుల పరిసరాల్లోని ప్రజలకు ప్రకృతి విపత్తులపై అవగాహన ఉండాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు తెలిపారు. మండలంలోని బాదనకుర్తి గ్రామంలో ప్రకృతి విపత్తులపై గురువారం అవగాహన కల్పించారు. వర్షాలు భారీగా కురిసి వరదలు సంభవించి న సమయంలో ముందస్తు జాగ్రత్తలు తెలియజేశా రు. వరదల నుంచి బయటపడే విధానం ప్రయోగా త్మకంగా వివరించారు. అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికా రి జీవరత్నం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సునీత, ఎంపీవో రత్నాకర్‌రావు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు, సిబ్బంది వినీత్, నవీన్, సందీప్, సోనూసింగ్, ఓం ప్రకాశ్, జావిద్, హుస్సేన్, మహేందర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.