
‘ఇందిరమ్మ’కు ఇబ్బందులు లేకుండా చూడాలి
● వచ్చే నెల 15 వరకు భూసమస్యలు పరిష్కరించాలి ● రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల భూసమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశా రు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచి వాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావుతో కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలి గిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరి ష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రెవె న్యూ సదస్సులకు వచ్చిన ప్రతీ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పనిచేసేలా చూడాలని, ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరాలో ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియాతోపాటు ఎరువులకొరత రాకుండా చూడాలన్నారు.
వనమహోత్సవం త్వరగా పూర్తి చేయాలి..
అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని, నిర్దేశించిన మొక్కలను కచ్చితంగా నాటాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ విజయవంతంగా కొనసాగుతుందని, ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించిన సందర్భంగా 97 డిపోలు, 321 బస్‌స్టేషన్లలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన ఆహార పంపిణీ, వారంలో ఒకరోజు అధికారులు బస చేయాలని సూచించారు.
కలెక్టర్ సమీక్ష..
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రౌండింగ్ చేపట్టిన వారు, ఇంటి నిర్మాణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు భూ సమస్యలన్నీ భూభారతి ప్రకారం పరిష్కరించాలన్నారు. నోటీసులు జారీ చేసిన దరఖాస్తుదారుల భూ సమస్యలపై విచారణ జరపాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు అన్ని గ్రామాలలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రైతులకు సరిపడినంత యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీఈవో రామారావు, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో రాజేందర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్‌గౌడ్, అంబాజీ శ్రీనివాస్, మోహన్‌సింగ్, ఎకై ్సజ్ అధికారి ఎంఏ.రజాక్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.