
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
నిర్మల్‌చైన్‌గేట్: వరంగల్ రైతు డిక్లరేషన్ పేర్కొన్న హామీలు అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల రుణ మాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని, 10 రకాల పంటలకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని, ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన అమలు చేయాలన్నారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలన్నా రు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బుచ్చన్నగారి ముత్యంరెడ్డి, నూతల శ్రీనివాస్‌రెడ్డి, రావుల రాంనాథ్, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.