
పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
కుంటాల: యాత్రికులు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోందనిభైంసా డీఎం హరిప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని లింబా(బి) గ్రామం నుంచి మహా రాష్ట్రలోని పండరిపూర్, తుల్జాపూర్ భవాని, పర్లి వైద్యనాథ్ వెళ్లే బస్ సర్వీస్‌ను సోమవారం ప్రారంభించారు. యాత్రకు వెళ్లేందుకు ఒక్కో ప్రయాణికునికి రూ.2,300 ఛార్జి నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని ఎక్కడికై నా పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు బైంసా డిపో నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ భారతి, వీబీవోలు శ్రీనివాస్, సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ భగవంత్‌రావు, సిబ్బంది సుభాష్, వికాస్, యాత్రికులు పాల్గొన్నారు.