
సీజనల్ వ్యాధులు నియంత్రించాలి
● కలెక్టర్లకు సీఎం ఆదేశం
నిర్మల్‌చైన్‌గేట్: సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు వురు మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల ని యంత్రణ, వరదల నష్ట నివారణ చర్యలు, వ్యవసా యం, సాగునీరు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై సమీక్షించారు. దోమల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, అధిక వర్షాలతో సంభవించే నష్టాలు నివారించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి ఆగ స్టు 14వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఇన్‌చా ర్జి మంత్రులు, శాసనసభ్యులు ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. రైతులకు అవసరమైన యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకో వాలన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు..
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధి కారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమలు, దోమ ల లార్వాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్య పనులతో వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులతోపాటు, అవసరమైన మందులన్నీ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించా రు. వరదల నివారణకు అప్రమత్తంగా ఉండాలన్నా రు. ఇప్పటికే జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టాక్ వివరాలు ప్రదర్శించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, డీపీవో శ్రీనివాస్, డీఏవో అంజిప్రసాద్, డీఎంహెచ్‌వో రాజేందర్, డీఎస్‌వో రాజేందర్, నీటిపారుదల శాఖ అధికారులు రవీందర్, అనిల్, గణేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.