
యాప్‌లో జాబ్స్
● డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ’తో ప్రైవేట్ ఉద్యోగ సమాచారం ● నిరక్షరాస్యుల నుంచి పీహెచ్‌డీ చేసిన అందరూ అర్హులే.. ● ఎప్పటికప్పుడు ఫోన్లకు నోటిఫికేషన్లు
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరు ద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క ల్పించే లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) యాప్‌ను ప్రవేశపె ట్టింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల సమన్వయంతో రూపొందిన ఈ ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫాం నిరుద్యోగులకు నమ్మకమై న ఉద్యోగ అవకాశాలు అంది స్తోంది. ఈయాప్‌తో యువత బోగస్ కంపెనీలు, మోసగాళ్ల బారిన పడకుండా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.
ఖాళీల సమాచారం..
డీఈఈటీ యాప్ ద్వారా పరిశ్రమలు, కంపెనీలు తమ ఖాళీల వివరాలను నేరుగా నిరుద్యోగుల మొబైల్ ఫోన్‌కు పంపిస్తాయి. ఈ సమాచారంలో ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వేతన వివరాలు, ఖాళీల సంఖ్య, మౌఖిక లేదా రాత పరీక్షల వివరాలు ఉంటాయి. ఈ విధంగా సమగ్ర సమాచారం అందిన నిరుద్యోగులు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. యాప్‌లో కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా ఇది మరింత సమర్థవంతంగా, వేగవంతంగా సేవలను అందిస్తోంది.
జిల్లా స్థాయిలో డీఈఈటీ..
ఇప్పటి వరకు జిల్లా నుంచి 24 కంపెనీలు, 12 ఇండస్ట్రీలు, 8 సర్వీస్ సెంటర్లు డీఈఈటీలో నమోదు చేసుకున్నాయి. జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు మరిన్ని సంస్థలను నమోదు చేయించేందుకు కృషి చేస్తున్నారు. నిరక్షరాస్యుల నుంచి ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్హతలు కలిగిన వారు వరకు ఎవరైనా ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకోవచ్చు. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్న ప్రైవేట్ రంగ ఖాళీలకు వారి అర్హతల ఆధారంగా అవకాశం పొందవచ్చు.
డీఈఈటీ యాప్ ప్రయోజనాలు..
డీఈఈటీ యాప్ నిరుద్యోగ యువతకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది:
మోసపూరిత కంపెనీల భయం లేకుండా నిజమైన ఉద్యోగ అవకాశాలు.
వివిధ నైపుణ్యాలు, అర్హతలు కలిగిన అభ్యర్థులకు తగిన ఉద్యోగాలను సూచించడం.
నిరంతర నియామక ప్రక్రియలతో సమర్థవంతమైన సేవలు.
ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు.
రిక్రూట్మెంట్ డ్రైవ్‌లు, జాబ్ ఫెయిర్‌లలో అవకాశాలు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులకు సహాయం, ప్లేస్మెంట్ సహకారం.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
డీఈఈటీ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవడం సులభం. ఆసక్తి ఉన్నవారు కింది విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా లాగిన్: డీ ఈఈ టీ అధికారిక వెబ్‌సైట్ https: //deet.telangana.gov.in లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీఈఈటీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
పేరు, పుట్టిన తేదీ, సెల్ నంబర్, ఈ– మెయిల్ ఐడీ, విద్యార్హతలు, టెక్నికల్ కో ర్సులు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
ఆశించే ఉద్యోగ రకం, పని చేయాలనుకునే ప్రాంతాలను ఎంపిక చేయాలి.
నిరుద్యోగులకు ఊరట..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీట్ యాప్‌తో నిరుద్యోగ యువతకు ప్రయోజనం చే కూరుతుంది. యువత ఈ సదావకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. అ ప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. డీట్ నమోదు చేసుకున్న యువత ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోని కంపెనీల్లోని ఉద్యోగ ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు వారి ఫోన్లకు నోటిఫికేషన్లు అందుతాయి. వాటి ఆధారంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.
– నరసింహారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి

యాప్‌లో జాబ్స్