
ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఆశ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18 వేలు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ఆశ వర్కర్స్ జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత లాంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈనెల 31న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. బైంసా ప్రభుత్వ హాస్పత్రిలో ఆశ వర్కర్లకు విశ్రాంతి గది కేటాయించాలన్నారు. ఆశ వర్కర్ ఫోన్ బిల్లు రూ.150 నుంచి రూ.300 పెంచాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పి.గంగమణి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత, కోశాధికారి రామలక్ష్మి, భాగ్య, ఇంద్రమాల, ముత్తవ్వ, సులోచన, కమల, స్వప్న, మమత, శ్యామల పాల్గొన్నారు.