
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
● చింతల రామచంద్రారెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా కార్యశాల సమావేశం జిల్లా అధ్యక్షుడు రితేష్‌రాథోడ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ స్థానిక సంస్థలన్నీ కై వసం చేసుకుని నిర్మల్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసేలా పనిచేస్తామన్నారు. బూత్, శక్తి కేంద్రాల వారీగా సమీక్షలు నిర్వహించి బీజేపీ పాలన ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్, నిర్మల్ ప్రాభరి భస్వపురం లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్‌రెడ్డి, మేడిసెమ్మె రాజు, పైడిపెల్లి గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.