
సర్కారు బడికే సై..
● మొగ్లీ గ్రామస్తుల తీర్మానం.. ● 75కు చేరిన విద్యార్థుల సంఖ్య
తానూరు: ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని మండలంలోని మొగ్లీ గ్రామస్తులు నిర్ణయించారు. ఇటీవల వీడీసీ, గ్రామస్తులు సమావేశం నిర్వహించి తమ ఊరి పిల్లలను దూర ప్రాంతాలకు పంపించకుండా స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్య అందేలా చూడాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ కమిటీ సభ్యులు శుక్రవారం విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. దీంతో విద్యార్థుల సంఖ్య 75కు చేరుకుంది. గ్రామ కమిటీ తరఫున ఇద్దరు వీవీలను నియమించి వారి వేతనాల కోసం కమిటీ నుంచి రూ.2 లక్షలు పాఠశాలకు విరాళంగా అందించారు.