నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jul 17 2025 3:16 AM | Updated on Jul 17 2025 3:16 AM

నిర్మ

నిర్మల్‌

నారుమడులకు నీరేది?
‘స్వర్ణ’ ఆయకట్టు అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వర్షాలు లేక ప్రాజెక్ట్‌ నిండకపోవడంతో నీరు రాక వరినా ర్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

˘9లోu

‘కేంద్ర’ పథకాల పరిశీలన

కుంటాల: మండలంలోని అందకూర్‌, అంబ కంటి తండాల్లో ఎల్‌ఎన్‌ఎం టీం సభ్యులు బు ధవారం కేంద్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించారు. ఈజీఎస్‌, సంసద్‌ ఆదర్శ గ్రామీణ యో జన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ డే తదితర పథకాలను టీం సభ్యులు నారాయణ, రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏవో శ్రీనివాస్‌, ఎంపీవో ఎంఏ రహీంఖాన్‌, ఏపీవో నవీన్‌, పంచాయతీ కార్యదర్శులు, రమ్య, సతీశ్‌, టీఏలు జైసింగ్‌, శశిందర్‌, ఎఫ్‌ఏ భోజన్న తదితరులున్నారు.

నిర్మల్‌: పడుతూ ఆగుతున్న వర్షాలు, మళ్లీ మండుతున్న ఎండలు.. ఇలా వాతావరణంలో తీవ్రమార్పులతో పాటు అపరిశుభ్రతతో జిల్లాలో దోమలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వైరల్‌ ఫీవర్లు ఉండగా, ఇటీవల ప్రాణాంతక డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వైరల్‌ ఫీవర్‌లు, జలుబు, జ్వరాలతో జిల్లాప్రజలు బాధపడుతున్నారు. మరోవైపు క్రమంగా డెంగీ అటాక్‌ చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు వందమంది వరకు డెంగీ బారినపడ్డట్లు సమాచారం. స్థానిక ఆస్పత్రులతో పాటు నిజామాబాద్‌, హైదరాబాద్‌లో కొందరు చికిత్స పొందుతున్నారు. ప్రతీ వర్షాకాలం సీజన్‌ మొదలైందంటే.. డెంగీకి భయపడాల్సి వస్తోంది. ఈసారి సీజన్‌లోనూ దోమలు పెరుగుతున్నా యి. క్రమంగా బాధితులూ పెరుగుతున్నారు. జిల్లా ఆస్పత్రుల్లో డెంగీకి కావాల్సిన వైద్య సదుపాయాలు, ప్లేట్‌లెట్స్‌ కౌంటింగ్‌ యంత్రం అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

నిర్లక్ష్యంతోనే వ్యాప్తి..

చిన్నపాటి నిర్లక్ష్యంతోనే డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి రావడానికి కారణమైన దోమలను ఓ రకంగా మనమే పెంచుతున్నాం. ప్ర ధానమంత్రి నుంచి పారిశుధ్య కార్మికుడి దాకా స్వ చ్ఛత పాటించండి.. అని ఎంత చెబుతున్నా.. కనీ సం వినేవారే లేరు. ఈ నిర్లక్ష్యం కారణంగా పెరిగే అపరిశుభ్రతే టైగర్‌ దోమ వ్యాప్తికి కారణమవుతోంది. టైగర్‌ దోమ జీవిత చక్రం వారంరోజుల్లోనే ప్రారంభమవుతుంది. ఇది మిగతా దోమలకు విరుద్ధంగా మంచినీటి నిల్వల్లోనే గు డ్లు పెడుతుంది. మన ఇంటి పరిసరాల్లో నిర్లక్ష్యంగా వదిలేసిన కూలర్లు, పాత్రలు, టబ్బులు, బకెట్లు, పాత సామగ్రి, తాగి పడేసిన కొబ్బరిబోండాలు, చిప్పలు, సీసాలు, ఖాళీ పూలకుండీలు, ప్లాస్టిక్‌ గ్లాసులు, టైర్లు.. వీటిలోనే వర్షపునీరు చేరి నిల్వ ఉంటుంది. అలాంటి నీటి నిల్వలే ఈ దోమల ఉత్పత్రికి నివా సాలుగా మారుతున్నాయి. ఇవి గుడ్లు పెట్టిన వారంలోనే దోమగా మారి కుట్టడం గమనార్హం.

ఆలస్యం చేస్తే ప్రమాదమే..

పగటిపూట ఎటాక్‌ చేసే టైగర్‌దోమ వరుసగా ఐదారుసార్లు కుట్టేందుకు ప్రయత్నిస్తుంది. అలా దాని బారిన పడితే ముందుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. జలుబు, వాంతులు, కీళ్లనొప్పులు, ఒంటిపై దద్దుర్లు, కంటి సంబంధ సమస్యలు మొదలవుతాయి. ప్లేట్‌లెట్స్‌ పడిపోతుంటాయి. చాలామంది సాధారణ జ్వరం అనుకుని ఇంటిపట్టునే ఏ ఆర్‌ఎంపీనో, స్థానిక ప్రాక్టీషనర్‌నో సంప్రదించి మందులు వాడుతుంటారు. అప్పటికీ తగ్గక పోతేనే అర్హత ఉన్న వైద్యుడి దగ్గరికి వెళ్తుంటారు. ఈక్రమంలో ఏమాత్రం ఆలస్యం చేసినా.. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయినా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. నిర్ధారణ పరీక్షతోనే డెంగీ ఉన్నదీ.. లేనిది తేలుతుంది. డెంగీ నిర్ధారణ పరీక్ష చేసుకున్న తర్వాత పాజి టివ్‌ రిపోర్ట్‌ వస్తేనే అవసరమైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సకాలంలో చికిత్స పొందాలి

డెంగీ జ్వరంతోనే ప్రారంభమవుతుంది. తీవ్రమైన జ్వరంతో తలనొప్పి రావడం, బీపీడౌన్‌ కావడం, వాంతులు, కీళ్లనొప్పులు, దద్దుర్లు తదితర లక్షణాలుంటాయి. జ్వరం తగ్గుతున్నట్లు అనిపించినా ప్లేట్‌లెట్స్‌ పడిపోతుంటాయి. చాలామంది సాధారణ జ్వరం అనుకుంటారు. కానీ, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదించాలి.

– డాక్టర్‌ బీ రవి, ఎండీ, జిల్లా జనరల్‌ ఆస్పత్రి

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు

కార్మికులకు స్పెషల్‌ సెల్‌

నిర్మల్‌ఖిల్లా: అసంఘటితరంగ కార్మికుల సంక్షేమానికి నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చే స్తూ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్‌పర్సన్‌ ఎస్‌.శ్రీవాణి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ విభాగంలోని ప్యానెల్‌ అడ్వకేట్‌ వీ మధుకర్‌, ససర్డ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల, పారా లీగల్‌ వలంటీర్లు ఎస్‌.కమలా కర్‌, జాప రాములు ప్రభుత్వ పథకాల అమలు లో కార్మికులకు తోడ్పాటునందిస్తారు. సేవలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

న్యూస్‌రీల్‌

బ్యాడ్మింటన్‌ పోటీలకు ఏర్పాట్లు

నిర్మల్‌టౌన్‌: ఈనెల 17 నుంచి 20వరకు జిల్లా కేంద్రంలోని కొండాపూర్‌ వద్ద గల నిర్మల్‌ స్పో ర్ట్స్‌ అకాడమీలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఏర్పాట్లు చేశారు. బుధవారం రిఫరీ పీవీఎ ల్‌ కుమార్‌, మ్యాచ్‌ కంట్రోలర్‌ భాస్కర్‌, ఎస్జీఎఫ్‌ సెక్రటరీ రవీందర్‌గౌడ్‌ ఏర్పాట్లు పరిశీలించారు. అండర్‌–19 బాలబాలికలకు సింగిల్స్‌, డబుల్‌, మిక్స్‌ డబుల్‌ విభాగాల్లో పోటీలుంటా యని తెలిపారు. 17న క్వాలిఫైయింగ్‌ పోటీలు, 18 నుంచి 20 వరకు మెయిన్‌ డ్రా పోటీలుంటా యని పేర్కొన్నారు. కోఆర్డినేటర్లు భూమన్న, మధు, నందకుమార్‌, ప్రశాంత్‌ ఉన్నారు.

జిల్లాలో దోమల స్వైరవిహారం

పెరుగుతున్న జ్వర పీడితులు

జిల్లాలో 100 మంది బాధితులు

చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిక

చర్యలు చేపట్టాలంటున్న ప్రజలు

పగటిపూటనే కుట్టే ‘టైగర్‌’..

టైగర్‌ (ఎడిస్‌ ఈజీఫ్లై) ఈ దోమనే మనిషి ప్రాణాలు తీసే డెంగీకి కారకం. పగటి పూట మాత్రమే కుట్టే ఈ దోమ మనిషి ప్రాణాలనూ తీస్తుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇది కుడుతుంది. రాత్రిపూట చీకటి ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. చూసేందుకు మామూలు దోమ కంటే చిన్నసైజులో ఉండే దీని కాళ్లు, రెక్కలపై తెల్లమచ్చలుంటాయి. నేలకు తక్కువ ఎత్తులో తిరుగుతూ.. ఎక్కువగా కాళ్లు, మడమల వద్ద కుడుతుంది. డెంగీ బారిన పడినవారికి తీవ్రమైన జ్వరం, జలు బు, వాంతులు, నొప్పులు మొదలవుతాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పడిపోతాయి. సరైన చికిత్స తీసుకోకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement