
‘భరోసా’తో వివాదాలు పరిష్కారం
● ఎస్పీ జానకీ షర్మిల ● భైంసాలో ప్రజావాణి
భైంసాటౌన్: పట్టణంలో ప్రతీ బుధవారం నిర్వహించే భరోసా కేంద్రం కుటుంబ వివాదాల పరి ష్కారంలో సత్ఫలితాలిస్తోందని ఎస్పీ జానకీ ష ర్మిల తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడా రు. అంతకుముందు డివిజన్ పరిధిలోని పలువు రు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఫోన్‌లో ఆదేశాలు, సూచనలు చేశారు. బాధితులకు స త్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం భరోసా కేంద్రంలో కు టుంబ వివాదాల కేసులు, పురోగతి వివరాలు తె లుసుకున్నారు. కుటుంబ సమస్యలపై షీటీం సి బ్బంది ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలి పారు. భైంసాలో భరోసాకేంద్రం ఏర్పాటుపై స్థా నికులు హర్షం వ్యక్తంజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఎస్పీ అవినాష్‌కుమార్, సీఐలు, ఎస్సై ఉన్నారు.
మహ్మద్ గౌస్ సేవలు ఎనలేనివి
పట్టణంలో ఎస్సైగా పనిచేసిన మహ్మద్ గౌస్ సేవలు ఎనలేనివని ఎస్పీ జానకీ షర్మిల కొనియాడా రు. గౌస్ ఇటీవల రిటైర్డ్ కాగా పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీఐలు, ఎస్సైలు గౌస్ విధి ని ర్వహణ తీరు కొనియాడారు. అనంతరం శా లు వాలు, పూలమాలలతో సన్మానించారు. సీఐలు గోపీనాథ్, నైలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లున్నారు.