
ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం!
మంచిర్యాలక్రైం: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌నగర్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రాంనగర్‌కు చెందిన సెటిపెల్లి శ్రీనివాస్ వద్ద కలీమ్ ఐదు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లించడంలో జాప్యం జరగడంతో కాలేజ్‌రోడ్ ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ షఫీ ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా సోషనల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన కలీమ్ ఆటోస్టాండ్ వద్ద ఆలౌట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఫిర్యాదు రాలేదన్నారు.
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
తలమడుగు: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు సుంకిడి గ్రామానికి చెందిన గంగాధర నందిని (19) ఆదిలాబాద్‌లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్లుగా మానసిక స్థితి సరిగాలేదు. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకుని కనిపించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
బేలలో యువకుడు..
బేల: మండల కేంద్రంలోని కుమురం భీం కాలనీకి చెందిన కుడిమెత రాంచందర్ (30) ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు రాంచందర్ కుటుంబంలో కొన్నిరోజులు గా కలహాలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంట్లో భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. చనిపోతానని తాడు తీసుకుని బయట కు వెళ్లాడు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఓ చెట్టు కొ మ్మకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య ల క్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మధుకృష్ణ తెలిపారు.
మద్యానికి బానిసై ఒకరు..
తానూరు: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు బామ్ని గ్రామానికి చెందిన కోతిమీర గౌతం (35) కొంతకాలంగా మద్యానికి బానిసై ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యలు పుష్పలత, అర్చన, కుమార్తె ఉన్నారు.
లింబగూడలో ఇంటర్ విద్యార్థి..
సిర్పూర్(టి): మండలంలోని లింబగూడలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సుర్పం శేఖర్ (17) సిర్పూర్‌లోని ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఈ నెల 11న ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని చెప్పగా పోనని ఇంటివద్దే ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి సుర్పం యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.