
డీ–1 పట్టాలపై సర్వే చేయాలి
●˘ MýSÌñæ-MýStÆŠ‡ AÀ-ÌêçÙ AÀ-¯]lÐŒæ
నిర్మల్‌చైన్‌గేట్: అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని డీ–1 పట్టాల జారీపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీ–1 పట్టాలపై క్షేత్రస్థాయిలో స ర్వే చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. భూహక్కులపై స్పష్టత కలిగేలా దరఖాస్తుల పరిశీలనలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను భూభారతి పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, తహసీల్దార్లు, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.