
హాజరుశాతం పెంచాలి
తానూరు: విద్యార్థుల హాజరు శాతం పెంచాలని డీఐఈవో పరశురాం సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేలా చూడాలని అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌కు రాజశేఖర్‌కు సూచించారు. అనంతరం విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భవనంలో సౌకర్యాలు లేవని అధ్యాపకులు, విద్యార్థులు డీఐఈవోను కోరారు. నూతన భవనం పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు. స్పందించిన పరశురాం సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి భవన నిర్మాణం ప్రారంభించేలా చూస్తామని తెలిపారు.