
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్
సారంగపూర్: వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయని, సీజన్ ముగిసేవరకు వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ సూచించారు. మండలంలోని ధని ఆరో గ్య ఉపకేంద్రం, సారంగాపూర్ పీహెచ్‌సీని మంగళవారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా, నిత్యం సేవలు అందిస్తున్నారా లేదా అని ఆరా తీశా రు. పీహెచ్‌సీలో సిబ్బందితో సమావేశమయ్యారు. పర్యవేక్షణ సిబ్బంది, వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశ కా ర్యకర్తలు నిత్యం గ్రామాల్లో పర్యటించి సమన్వయంతో సీజనల్ వ్యాధులను కట్టడి చేయాలని తెలి పారు. వర్షాకాలం ముగిసే వరకూ సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. ఆరోగ్య ఉపకేంద్రాలను ఆయుష్మాన్ భారత్ సెంటర్లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఎంహెచ్‌హెచ్‌వో వెంట మాస్‌మీడియా అధికారి రవీందర్, వైద్యాధికారులు అబ్దుల్ జవాద్, ప్రత్యూష, అష్రార్ సిద్దిఖీ, పర్యవేక్షకులు కృష్ణమోహన్‌గౌడ్, ప్రేమ్‌సింగ్, ఉషారాణి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్‌చైన్‌గేట్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని నోడల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గర్భిణులకు సకాలంలో అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో స్టాప్ డయేరియా, టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో కార్యక్రమం నిర్వహణ అధికారులు డాక్టర్ ఆశిష్‌రెడ్డి, డాక్టర్ సౌమ్య, డీపీహెచ్‌ఎన్‌వో సాయమ్మ, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, డీడీఎం గంగాధర్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.