
మహిళా సంఘాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
దస్తురాబాద్/ఖానాపూర్: ఇందిరమ్మ ఇళ్లను మహిళా సంఘాలు నిర్మించి లబ్ధిపొందాలని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. దస్తురాబాద్ మండల కేంద్రంలో 40 మంది లబ్ధి దారులకు, ఖానాపూర్ పట్టణంలో పలువురు లబ్ధి దారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు మంజూరు చేసిందన్నారు. అయితే కొందరు డబ్బులు లేక నిర్మాణా నికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మహిళా సంఘాలు బ్యాంకు రుణాలతో వాటిని నిర్మించి లబ్ధి పొందాలన్నారు. త్వరలోనే రెండో విడత ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఖానాపూర్, కడెం మండలాల్లో రెండు నెలల్లోనే పదివేల మంది కి రేషన్‌కార్డులు ఇచ్చామని వెల్లడించారు. ఖానా పూర్ మండలం బాదనకుర్తి పంచాయతీ పరిధిలోని చింతల్‌పేట్‌తోపాటు పట్టణంలోని తిమ్మాపూర్ పరిధిలో రూ.20 లక్షలతో నిర్మించే పీహెచ్‌సీ సబ్ సెంటర్లకు శంకుస్థాపన చేశారు. మస్కాపూర్ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద జరిగిన వనమహోత్సవంలో పాల్గొన్నారు. తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో రమేశ్‌రెడ్డి, కాంగ్రెస్ దస్తురాబాద్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేశ్, మాజీ ఎంపీపీ సింగరి కిషన్, నాయకులు రమేశ్‌రావు, వెంకన్న, శివ్వయ్య, కొమురవెళ్లి, శరత్‌రెడ్డి, పడిగెల భూషణ్, మాజిద్, దయానంద్, నిమ్మల రమేశ్, చిన్నం సత్యం, అంకం రాజేందర్, షబ్బీర్‌పాషా, గంగనర్సయ్య, మడిగెల గంగాధర్, షౌకత్‌పాషా, జంగిలి శంకర్, రాజునాయక్, మాసుల లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.