
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రావొద్దు
నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రాకుండా సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఇసుక లభ్యత, అక్రమ రవాణా నియంత్రణ, భూభారతి చట్టం, సీఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డులపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక బజార్‌లు ఏర్పాటు చేసి, ఆన్‌లైన్ విక్రయాలతో పారదర్శకతను పెంచనున్నట్లు తెలిపారు. ఇసుక నిల్వ స్థలాలను గుర్తించాలని, గ్రానైట్ సేకరణకు జీరో పర్మిట్ విధానం అమలు చేయాలని సూచించారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు, ఇసుక ధరల నియంత్రణను నిర్ధారించాలన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారం, సీఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డుల ఆమోదంలో వేగం పెంచాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, మైనింగ్ ఏడీ, జియాలజీ రవీందర్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, భూగర్భజలాల శాఖ అధికారి శ్రీనివాసబాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, తహసీల్దార్లు, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్